Nimishamba Devi | నిమిషాంబ దేవి ఆలయంలో 3 నుంచి దేవీ శరన్నవరాత్రోత్సవాలు..
Sridevi Sharannavarathrotsavam | గ్రేటర్ వరంగల్ పరిధిలోని 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధ శ్రీ నిమిషాంబ దేవి (Nimishamba Devi) అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 3 గురువారం నుంచి 12వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలను నిర్వహించనున్నారు.
మొదటి రోజు 03-10-2024 గురువారం ఉదయం 6-00 గంటలకు గణపతిపూజ, పుణ్యాహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థాపనం, అఖండదీపం కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ తెలిపింది.అలాగే 03-10-2024 నుంచి 12-10-2023 విజయదశమి రోజు వరకు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. విజయదశమి శనివారం రోజు ఉదయం అమ్మవారిని అభిషేకించి, కలశ ఉద్వాసన, పూర్ణాహుతి చేసిన తదుపరి అమ్మవారికి విశేషపూజలు అర్చనలు, మంగళరతులు, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం 5-00 గంటలకు జమ్మిపూజ నిర్వహించనున్నారు. రాత్రి 9-00 గంట...