Ram Navami 2024 : రామనవమి సందర్భంగా అయోధ్య ఆలయంలో 19 గంటల పాటు రాముడి దర్శనం..
Ayodhya : శ్రీరామనవమి పర్వదినం (Ram Navami 2024) సందర్బంగా ఏప్రిల్ 17న అయోధ్య రామాలయాన్ని భారీ సంఖ్యలో భక్తులు సందర్శించే అవకాశముంది. ఈ నేపథ్యంలో రామమందిర్ ట్రస్ట్ భక్తులకు కీలక సూచన చేసింది. అయోధ్యలో రాముడి విగ్రహం ప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలిసారి శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు 25లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అయోధ్యలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు శ్రీరామనవమి రోజున అయోధ్యకు రావద్దని రామమందిర్ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది
వీఐపీ పాసులు రద్దు..
అయోధ్య రామాలయానికి సంబంధించిన అన్ని VIP పాస్‌లను ఏప్రిల్ 18 వరకు మూడు రోజుల పాటు రద్దు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర సభ్యుడు ఒకరు వెల్లడించారు. ప్రముఖులు, విఐపిలందరూ ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే అయోధ్యను సందర్శించాలని రామ్ టెంపుల్ ట్రస్ట్ సూచించింది. ఇది ఏప్రిల్ 17న జరగనున్న రామ నవమి వేడుకలకు ముందు వస్తుంద...