International Left-Handers Day 2023 : ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ’
International Left-Handers Day 2023: ప్రతీ విషయంలో మంచి, చెడు ఉంటాయి. మంచినీ, చెడునీ.. పవిత్రతనూ, అపవిత్రతనూ ఈ కుడి, ఎడమలతోనే పోల్చితే కుడి వైపు మంచిదని, ఎడమవైపు చెడుదని అంటుంటారు. మొదటిసారి ఇంట్లో అడుపెట్టాలనుకుంటే కుడికాలే పెట్టమంటారు. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కుడి చేతినే అందిస్తుంటాం.. సాధారణ వ్యక్తులు ఏపని చేసినా కుడిచేయితోనే చేస్తుంటారు. కానీ వీరికి భిన్నంగా ఎడమ చేతివాటమున్న వ్యక్తులు చేసే పనులు చాలా విచిత్రంగా, ఇన్ ట్రెస్టింగ్ గా ఉంటాయి.
ఎన్నో సవాళ్లు..
ఎడమ చేతివాటం ఉన్నవారు (Left-Handers) నిత్యజీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుంది. శుభకార్యాల్లో పాల్గొన్నపుడు వీరు ఎడమ చేతిలో అన్ని పనులు చేస్తున్నపుడు ఎదుటివారి నుంచి కామెంట్లు వస్తుంటాయి. ఎడమచేతితో షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఎడమ చేతితో భోజనం తింటున్నా, ఎదుటివారికి వడ్డించినా కొంతమంది వీరిని సరిగ్గా అర్థం చేసుకోలేరు. చివరికి కం...