Special Polling Booths | ఓటింగ్ శాతం పెంచేందుకు వినూత్నమైన స్పెషల్, సఖి, ట్రైబల్ థీమ్ పోలింగ్ కేంద్రాలు ఎక్కడో తెలుసా.. ..
Special Polling Booths | లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం వినూత్నమైన కార్యకమ్రాలు చేపడుతోంది. ఇందులో భాగంగా కర్నాటకలో 1800 స్పెషల్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. మహిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,120 సఖి పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలను పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు.బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలందరూ ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని చర్యలను తీసుకుంటోంది. గిరిజనులు, మహిళలు, దివ్యాంగులను ఓట్లపండుగలో పాల్గొనేలా కర్ణాటకలో ఎన్నికల సంఘం (EC) 1,832 ప్రత్యేక పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
షెడ్యూల్డ్ తెగల శాఖ ఈసీ సమన్వయంతో గిరిజన సంస్కృతి నేపథ్యం ఆధారంగా 40 ప్రత్యేక పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తోంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ...