Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: solar energy

Solar Pump Set | రైతుల‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లో ఉచితంగా సోలార్ పంపు సెట్లు..?
Telangana

Solar Pump Set | రైతుల‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లో ఉచితంగా సోలార్ పంపు సెట్లు..?

Solar Pump Set | హైదరాబాద్ : రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ( Solar Energy )ఉత్ప‌త్తి పెంచేందుకు తెలంగాణ స‌ర్కారు క‌స‌రత్తు చేస్తోంది. ఇప్ప‌టికే గృహ‌జ్యోతి ప‌థ‌కం (Gruha jyothi Pathakam)  కింద పేద‌ల‌కు 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ అందిస్తుండ‌డంతో ప్ర‌భుత్వంపై భారం ప‌డుతోంది. అంతేకాకుండా కొన్ని నెల‌లుగా విద్యుత్ స‌ర‌ఫ‌రాలో తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతుండ‌డ‌తో ప్ర‌జ‌ల నుంచి అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విద్యుత్ శాఖ‌పై బుధ‌వారం స‌మీక్షించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్‌ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భ‌విష్య‌త్ విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూసుకోవాల‌న్నారు. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవ‌స‌ర‌మైన‌ చర్యలు చేపట్టాల‌ని సూచించారు. సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తిని ...
Himanta Biswa Sarma : హేమంత బిస్వా శర్మ సంచలన నిర్ణయం.. 70 ఏళ్ల విఐపి కల్చర్ కు స్వస్తి..
National

Himanta Biswa Sarma : హేమంత బిస్వా శర్మ సంచలన నిర్ణయం.. 70 ఏళ్ల విఐపి కల్చర్ కు స్వస్తి..

Himanta Biswa Sarma : అస్సాం ముఖ్యమంత్రి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అస్సాం రాష్ట్రంలో వీఐపీ సంస్కృతిని అంతం చేసేందుకు, మంత్రులు.. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదివారం ప్రకటించారు. . పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించి ప్రభుత్వ అధికారుల కరెంటు బిల్లులు చెల్లించే #VIPCulture రూల్‌కు ముగింపు పలుకుతున్నట్లు చెప్పారు.తాజా ప్రకటన తర్వాత, సీఎం శర్మతో సహా మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులంద‌రూ తమ సొంత విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. హిమంత బిస్వా శర్మ జూలై 1న వారి విద్యుత్ బిల్లులను చెల్లించే మొదటి వ్యక్తిగా ఉంటాని చెప్పిన ఆయ‌న.. మిగిలిన మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు."జూలై 2024 నుండి, ప్రభుత్వ ఉ...
Rooftop Solar Scheme: ఉచిత సోలార్ స్కీమ్ కి ఎలా అప్లై చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..
Special Stories

Rooftop Solar Scheme: ఉచిత సోలార్ స్కీమ్ కి ఎలా అప్లై చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

Rooftop Solar Scheme: ప్రజలు తమ ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించేందుకు సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. ఈ పథకానికి 75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామని మోదీ చెప్పారు. ప్రధానమంత్రి సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన ( PM Surya Ghar, Muft Bijli Yojana) ,  కింద ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా 1 కోటి గృహాల్లో వెలుగులు నింపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-'25 మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని తొలిసారిగా ప్రకటించారు.Free Rooftop Solar Scheme సోలార్ ప్యానెల్ పథకం కింద, పథకం లబ్ధిదారులకు భారీగా సబ్సిడీలు అందించబడతాయని, వాటిని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని మోడీ చెప్పారు. భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల అందించి , ప్రజలపై ఎటువంటి వ్యయ భారం లేకుండా ...
solar systems | ఇంటిపై సోలార్ పెట్టుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఎంత? ఈఎంఐ సౌకర్యం ఉంటుందా..?
Special Stories

solar systems | ఇంటిపై సోలార్ పెట్టుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఎంత? ఈఎంఐ సౌకర్యం ఉంటుందా..?

solar systems: తెలంగాణ‌లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ రెడ్కో కృషి చేస్తోంది.   ఇంధ‌న పొదుపు వారోత్సవాల్లో భాగంగా. సోలార్ విద్యుత్ వల్ల క‌లిగే లాభాలు, ప్రభుత్వ స‌బ్సిడీల పై  ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తరచూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే.. సోలార్ విద్యుత్ కకోసం గృహాల‌కు అందిస్తున్న స‌బ్సిడీ ఎంత‌? మ‌హిళా సంఘాల‌కు ఏ విధ‌మైన స‌బ్సిడీ అంద‌జేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.సోలార్ రూఫ్ టాప్.. నెట్ మీటరింగ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు కోసం రెడ్కో వ్యక్తి గత గృహాలకు 40% సబ్సిడీ అంద‌జేస్తుంది. దీని వల్ల అధిక కరెంటు బిల్లుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే.. సోలార్ పవర్ సిస్టం మనం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే క‌నీసం 100 చద‌ర‌పు అడుగుల రూఫ్ ఉండాలి.. సోలార్ ఏర్పాటు చేస్తే నిర్వహ‌ణకు ఇబ్బంది అవుతుంద‌నే ప్రచారం ఉంది. కానీ రెడ్‌కో ద్వారా అందించే సోలార్ ప్య...