నిండైన చీరకట్టుతో ఈ మహిళ చేసిన డ్యాన్స్ అదుర్స్..
సాధారణ ప్రజలు తమ టాలెంట్ ను ప్రదర్శించేందుకు సోషల్ మీడియా చక్కని వేదికగా నిలుస్తోంది. చాలా మంది తమలో మరుగుపడిన నైపుణ్యాలను సోషల్ మీడియాలో చేయడం ద్వారా అవి క్షణాల్లోనే వైరల్ అయి ఊహించని విధంగా ఫేమ్ అవుతున్నారు. అయితే తాజాగా ఓ తెలుగు మహిళ చేసిన అద్భుతమైన డాన్స్, మ్యాజిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.@koteswari_kannan_official పేరుతో 49,000 మందికి పైగా ఫాలోవర్స్ కలిగి ఉన్న మహిళ తన Instagram ఖాతాలో వీడియోను పోస్ట్ చేసింది. నిండుగా చీర ధరించి మూడు చిన్న బంతులను గాలిలో ఎగురువేస్తూ ఒక రింగ్ తో హులా హూప్ చేస్తున్న వీడియో చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీనిపై పలువురు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు.
"ఆమె ప్రతిభకు తనదైన రీతిలో నిర్వచనం.. ట్రెండింగ్ పాటలకు ట్రెండింగ్‌ను సృష్టిస్తోంది" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. "ఒక పుస్తకాన్ని దాని కవర్‌ని బట్టి అంచనా వేయవద్దు" అని మర...