Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Snake-handling

Viral Video : భయం లేదు.. బెరుకూ లేదు.. పాములను పట్టడంలో ఈ యువతి నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా..
Trending News

Viral Video : భయం లేదు.. బెరుకూ లేదు.. పాములను పట్టడంలో ఈ యువతి నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా..

మనకెదురుగా ఏదైనా పాము కనిపించిందటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఓ యువతి మాత్రం విష సర్పాలను చాలా నైపుణ్యంతో ఈజీగా బంధించి సురక్షిత ప్రాంతాల్లోకి వదిలి వాటి ప్రాణాలను కాపాడుతోంది. ఆమె పాములను పడుతున్న వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ లో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. శ్వేతా సుతార్ అనే పేరు(shweta wildliferescuer )తో ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ధైర్యవంతురాలైన యువతి ఇంటర్నెట్‌లో దూసుకుపోయింది. ఆశ్చర్యపరిచేలా పాములను పట్టుకునే నైపుణ్యాలు చూసి సోషల్ మీడియా వినియోగదారులు విస్మయానికి గురవుతున్నారు.shweta wildliferescuer ఇన్‌స్టాగ్రామ్  లో  ఓ వీడియోను పరిశీలిస్తే.. ఒక మాల్ లో ఒక పెద్ద పాము దాగి ఉందని తెలిసి ఈ యువతి అక్కడికి వెళ్లింది.  ప్రశాంతతతో పాములను బంధించే పరికరాన్ని పట్టుకొని ఆ సరీసృపాన్ని రక్షించడానికి లోపలికి అడుగులు వేసింది. కొద్దిసేపటికే ప్రశాంతంగా పామును తన చేతితో పట్టుకొని దుకాణం నుండి బయట...