Lava Blaze Curve 5G | త్వరలో మేడిన్ ఇండియా.. లావా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..
Lava Blaze Curve 5G స్మార్ట్ ఫోన్.. త్వరలో భారతదేశంలో అధికారికంగా అందుబాటులోకి రానుంది. అయితే ఈ దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్.. ఫోన్‌కు ఖచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు, కానీ లాంచ్ కు ముందే దాని ముఖ్య లక్షణాలు, ధర వివరాలు వెలుగులోకి వచ్చాయి. Lava Blaze Curve 5G, MediaTek Dimensity 7050 SoCలో పనిచేస్తుందని తెలిసింది. ఇది 8GB RAM, 256GB వరకు ఇన్ బిల్ట్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. లావా బ్లేజ్ 2 5G గత సంవత్సరం నవంబర్‌లో సేల్ అయింది. ఇది బ్లేజ్ సిరీస్‌లో తక్కువ ధరలోనే వచ్చింది.
ధర ఎంత ఉండొచ్చు..?
Tipster Paras Guglani (@passionategeekz) X లో లావా బ్లేజ్ కర్వ్ 5G ధర భారత్ లో రూ. 16,000 నుంచి రూ. 19,000. మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఇది రెండు కలర్ ఆప్షన్లలో వస్తుందని చెబుతున్నారు. టిప్‌స్టర్ ప్రకారం.. హ్యాండ్‌సెట్ MediaTek డైమెన్సిటీ 7050 SoC ద్వారా పనిచేస్తుంది. ఈ చిప్...