Railway Security : రైల్వే భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం
Railway Security | ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రైలులోని అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ప్యాసింజర్ కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయా రైల్వే(Indian Railways) ఆమోదించాయి. చాలా కాలంగా, నడుస్తున్న రైళ్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి అనేక కేసులు వస్తుండడంతో భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు.. ఇంజిన్లు, కోచ్‌లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పురోగతిని సమీక్షించారు. "సీసీ కెమెరాల ఏర్పాటు ప్రయాణికుల భద్రతను మెరుగుపరుస్తుంది. దుండగులు, వ్యవస్థీకృత ముఠాలు అమాయక ప్రయాణికులను దోచుకుంటున్నారు. కెమెరాల ఏర్పాటు వల్ల ఇలాంటి సంఘటనలు తగ్గుతాయి. ...