Sikkim Floods: ఆకస్మిక వరదల కారణంగా 19కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా తెలియని 103 మంది ఆచూకీ..
Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 19కి పెరిగింది. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 103 మంది అదృశ్యమయ్యారు. ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు తీస్తా నది పరీవాహక ప్రాంతంలో బురద మట్టిలో అలాగే ఉదృతంగా ప్రవహిస్తున్ననీటిలో గల్లంతైన వారికోసం కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై ఆకస్మిక వర్షాలతో రాష్ట్రంలో భారీ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. కాగా ఈ వరదల్లో నలుగురు మృతదేహాలను 'జవాన్లు'గా గుర్తించినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది.లాచెన్, లాచుంగ్‌లలో అనేక మంది బైకర్లు, విదేశీయులు, దాదాపు 700-800 మంది డ్రైవర్లతో సహా 3,000 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారని, వారందరినీ ఆర్మీ, వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా రక్షించనున్నట్లు చీఫ్ సెక్రటరీ విబి పాఠక్ తెలిపారు.సిక్కిం చీఫ్ సెక్రటరీ విజయ్ భూషణ్ పాఠక్ ...