Siachen Glacier : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమి సియాచిన్ గ్లేసియర్ గురించి మీకు తెలియని వాస్తవాలు
Siachen Glacier : సియాచిన్ గ్లేసియర్ హిమాలయాల్లోని కారకోరం శ్రేణి (Karakoram) లో ఉన్న ఒక హిమానీనదం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమి సియాచిన్ గుర్తింపు పొందింది. కారాకోరం పర్వత శ్రేణిలో ఇండో-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలో ఇది ఉంటుంది.
సియాచిన్ గ్లేసియర్ ఎంత చల్లగా ఉంది?
భారతదేశంలో 5,400 మీటర్ల ఎత్తులో ఉండే అతిపెద్ద హిమానీనదం సియాచిన్ గ్లేసియర్.. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద హిమానీనదంగా ఉంది. ఇక్కడ తరచుగా మైనస్ 45 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంచు తుఫానులతో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. రక్తం గడ్డకట్టుకొని పోయే చలితో పాటు కనీసం ఊపిరి తీసుకోవాడానికి కూడా వీలుండదు.. కాబట్టి ఇది మానవులకు ఏమాత్రం నివాసయోగ్యం కాదు.ఏప్రిల్ 1984లో భారత సైన్యం (Indian Army) హిమానీనదంపై ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి సియాచిన్ వద్ద రక్షణ విధుల్లో భాగంగా సుమారు వెయ్యి మంది సైనికులు ...