జూన్ నెలాఖరులో అయోధ్య ఆలయ ఒకటో అంతస్తు పనులు పూర్తి
వచ్చే జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం జరిగే అవకాశం
Ayodhya temple construction work: అయోధ్యలోని మూడు అంతస్థుల రామాలయం మొదటి అంతస్తు నిర్మాణం ఈ నెలాఖరులోగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. 2020లో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది.“ఈ నెలాఖరు నాటికి, ఆలయం మొదటి అంతస్తు ప్రారంభమవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. అక్టోబరు నాటికి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది ”అని అన్నారు. ఆగస్టు 5, 2020న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి పునాది వేశారు. ఆ తర్వాత నిర్మాణం ప్రారంభం కాగా సీనియర్ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నేతృత్వంలోని లార్సెన్ &...