ప్రెషర్ కుక్కర్ ను ఎక్కువగా వాడుతున్నారా? అందులో ఇవి మాత్రం వండకండి
టైంను ఆదా చేసుకునేందుకు వంటలు త్వరగా తయారు చేసుకునేందుకు ప్రెషర్ కుక్కర్ వాడకం ఈ రోజుల్లో ప్రతీ ఇంటిలో అనివార్యమైపోయింది. ఇది విలువైన సమయాన్ని ఆదా
చేయడమే కాకుండా, పదార్థాల రుచులు, పోషకాలను సంరక్షిస్తుంది. చిక్కుళ్ళు, ధాన్యాలకు సంబంధించిన వంటలను తొందరగా చేస్తుంది. అయితే .. ఈ ప్రెషర్ కుక్కర్ లో
వండకూడని ఆహార పదా ర్థాలు కూడా ఉన్నాయి. ఈ ఆహారాలను వండడం కొంత హానికరం కావొచ్చు.. అంతేకాకుండా జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ ఆహారపదర్థాలేంటో ఇప్పుడు
చూద్దాం..Rice - అన్నం
సమయాభావం వల్ల తరచుగా ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండుతారు. అన్నం వండడానికి కుక్కర్‌ని ఉపయోగించే వారిలో మీరు కూడా ఒకరైతే, మళ్లీ ఈ తప్పు చేయకండి. ఇది
బియ్యంలో ఉండే స్టార్చ్ ఆరోగ్యానికి హానికరమైన యాక్రిలామైడ్ అనే హానికరమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. అందుకే ప్రెషర్ కుక్కర్‌లో చేసిన అన్నం మీకు హానికరం
కావొచ్చు. బియ్యాన్ని ఉడ...