Maharashtra Assembly polls | మహారాష్ట్ర ఎన్నికలు.. మహా వికాస్ అఘాడి (MVA) కూటమి పొత్తు ఖరారు..
Maharashtra Assembly polls | మహారాష్ట్ర లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా- కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) మధ్య పొత్తులో భాగంగా సీట్ల పంపకం పూర్తయింది. 288 సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో ఒక్కో పార్టీ 85 స్థానాల్లో పోటీ చేయనున్నారు. మిగిలిన సీట్లు MVA కూటమి భాగస్వాములు చిన్న మిత్రపక్షాల మధ్య పంపిణీ చేయన్నారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత బాలాసాహెబ్ థోరట్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్, ఇతర నేతలు సహా ఎంవీఏ నేతలు శరద్ పవార్‌తో సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. సీట్ల కేటాయింపు వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.మూడు ప్రధాన MVA భాగస్వాములు-కాంగ్రెస్, శివసేన (UBT), NCP (SP)- 85 చొప్పున సమాన సంఖ్యలో సీట్లు కేటాయించార...