Thursday, April 3Welcome to Vandebhaarath

Tag: Senior citizens

స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ స్కీమ్ లో భారీ మార్పులు.. అవేంటో తెలుసా?
Business

స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ స్కీమ్ లో భారీ మార్పులు.. అవేంటో తెలుసా?

Swatantrata Sainik Samman Yojana | స్వాతంత్య్ర సమరయోధులు.. లేదా వారిపై ఆధారపడిన వారికి పింఛన్లు అందించే పథకమైన స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజనలో కేంద్రం శుక్రవారం భారీ మార్పులు చేసింది. గ‌తంలో 80 ఏళ్లు పైబడిన వారు సంవత్సరానికి రెండుసార్లు లైఫ్‌ సర్టిఫికేట్‌ను సమర్పించాలనే నిబంధ‌న‌ను తొల‌గించారు. కొత్త రూల్ ప్ర‌కారం.. లబ్ధిదారులు ఇప్పుడు తమ లైఫ్ స‌ర్టిఫికెట్ ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే సమర్పిస్తే స‌రిపోతుంది.నవంబర్ గడువులోగా పెన్షనర్ తన లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించక‌పోతే వారి పెన్షన్ ఆగిపోతుంది. అయితే, కొత్త మార్గదర్శకాల ప్రకారం, మూడేళ్లలోపు తమ సర్టిఫికేట్‌ను సమర్పించిన లబ్ధిదారులకు బకాయిలతో పాటు వారి పింఛను తిరిగి ప్రారంభమవుతుంది.లైఫ్ సర్టిఫికెట్ ను మూడేళ్ల వ్యవధిలో సమర్పించక‌పోతే పెన్షన్‌లు రద్దు చేస్తారు. కొత్త నిబంధనల స్వాతంత్య్ర సమరయోధుడు పెన్షనర్ మరణించిన తర్వాత, అతని జీవిత భ...
70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా ప్రారంభించిన ప్రధాని మోదీ
National

70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా ప్రారంభించిన ప్రధాని మోదీ

PM-JAY Ayushman Bharat Yojana : ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, ఆయుర్వేద దినోత్స‌వం సందర్భంగా ఈ పథకానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు.ఈ నెల ప్రారంభంలో కేంద్ర మంత్రివర్గం ఆరోగ్య బీమా ప్లాన్ ను ఆమోదించింది. ఇది భారతదేశంలోని 70 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు అదనంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్‌భారత్‌ ‌పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు బీమా కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం లబ్ధి చేకూరుతుంది. ప్రైవేటు వైద్యఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారు కూడా రూ.5 లక్షల ప...
Indian Railways | సీనియర్ సిటిజన్స్ కోసం రైళ్లో లభించే ఉచిత సౌకర్యాలు ఏంటో మీకు తెలుసా..?
Trending News

Indian Railways | సీనియర్ సిటిజన్స్ కోసం రైళ్లో లభించే ఉచిత సౌకర్యాలు ఏంటో మీకు తెలుసా..?

Indian Railways | భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్ల (Senior Citizens )కు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 60 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, 45 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు లోయర్ బెర్త్‌లకు అర్హులు. అలాగే కొన్ని మార్గదర్శకాలను అనుసరించి సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌ను పొందే అవకాశాలను పొందవచ్చు.సీనియర్ సిటిజన్లు రైలులో ప్రయాణించేటప్పుడు ఉచితంగా ఈ సౌకర్యాలను పొందవచ్చు, ఫలితంగా వారు సాఫీగా గమ్యస్థానాలను చేరవచ్చు. అయితే, సీనియర్ సిటిజన్లు ఒంటరిగా లేదా గరిష్టంగా ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ఎక్కువ మందితో కలిసి ప్రయాణిస్తున్నట్లయితే, లోయర్ బెర్త్ ప్రాధాన్యత హామీ ఉండదు. సీనియర్ సిటిజన్‌కు ఎగువ లేదా మధ్య బెర్త్ కేటాయిస్తే, టిక్కెట్ తనిఖీ సిబ్బంది ప్రయాణ సమయంలో అందుబాటులోకి వస్తే వారిని దిగువ బెర్త్‌కు ...
Ayushman Bharat card | ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
National

Ayushman Bharat card | ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

Ayushman Bharat card | 70 ఏళ్లు పైబడిన వృద్ధుల‌కు ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై)ని వ‌ర్తింప‌జేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కార్యక్రమం అనుబంధ (పబ్లిక్ లేదా ప్రైవేట్) ఆసుపత్రులలో ద్వితీయ, తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవల కోసం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు నగదు రహిత వైద్య‌సేవ‌ల‌ను అందిస్తుంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఈ కార్యక్రమం సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు, మొత్తం ఆరు కోట్ల మంది వృద్ధులకు ప్రయోజనం చేకూరుతుంది.ఆన్‌లైన్‌లో ఆయుష్మాన్ భారత్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి, సీనియర్ సిటిజన్‌లు ప్ర‌భుత్వ అధికారిక‌ పోర్టల్‌ను సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. ద‌ర‌ఖాస్తును సమర్పించిన తర్వాత, అప్లికేషన్ ఆమోదం కోసం అధికారుల‌కు పంపుతుంది. అధికారులు ఆమోదించిన తర్వాత, హెల్త్‌...
Railway Fare | సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీల్లో రాయితీ లభిస్తుందా? బడ్జెట్‌లో ఏం ఉండనుంది.?
National

Railway Fare | సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీల్లో రాయితీ లభిస్తుందా? బడ్జెట్‌లో ఏం ఉండనుంది.?

Railway Fare | భారతీయ రైల్వేలు రైలు ఛార్జీలపై సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను 2020 మార్చిలో నిలిపివేసింది. ఈ రాయితీ కింద గతంలో మహిళా సీనియర్ సిటిజన్లకు 50 శాతం తగ్గింపు, పురుషులు, ట్రాన్స్‌జెండర్, సీనియర్ సిటిజన్లకు 40 శాతం తగ్గింపు ఇచ్చింది.అయితే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్‌ను జూలై 23న సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌లో ఏదైనా ప్రత్యేక ప్రకటన వెలువడవచ్చని అన్ని వర్గాల ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. పన్నుకు సంబంధించి ప్రకటన చేస్తారని మధ్యతరగతి వర్గాలు ఎదురుచూస్తున్నారు. కాగా, సీనియర్ సిటిజన్లు కూడా బడ్జెట్‌పై ప్రత్యేక అంచనాలు పెట్టుకున్నారు.అయితే ప్రభుత్వం రైల్వే రాయితీలను పునరుద్ధరించే చాన్స్ ఉందని సీనియర్ సిటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 2020లో భారతీయ రైల్వేలు రైలు ఛార్జీలపై సీనియర్ సిటిజన్‌లకు అందించే రాయితీలను నిలిపివేసింది. ఇందులో మహిళా సీనియర్ ...
Indore Lok Sabha | ఎన్నిక‌ల్లో ఓటువేస్తే రుచిక‌ర‌మైన జిలేబీలు, ఐస్ క్రీమ్‌లు అంద‌జేస్తార‌ట‌..
Elections

Indore Lok Sabha | ఎన్నిక‌ల్లో ఓటువేస్తే రుచిక‌ర‌మైన జిలేబీలు, ఐస్ క్రీమ్‌లు అంద‌జేస్తార‌ట‌..

Indore Lok Sabha : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఫుడ్ షాపుల యజమానులు వచ్చే నెలలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభ సమయంలో ఓటు వేసిన వారికి ఉచితంగా పోహా, జిలేబీలు, ఐస్‌క్రీం అందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య పరంగా అతిపెద్ద నియోజకవర్గమైన ఇండోర్ (Indore Lok Sabha) లో మే 13న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ వాణిజ్య సంస్థల సమావేశంలో ఉచిత ఆహార పదార్థాలను అందించాలని నిర్ణయించినట్లు దుకాణ యజమానులు తెలిపారు.స‌మావేశం అనంతరం ఆశిష్‌ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఓటింగ్‌లో ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలపాలనుకుంటున్నామని, ఇందుకోసం వాణిజ్య సంస్థల సహకారం తీసుకుంటున్నామని ఆయ‌న‌ అన్నారు. నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య ఓటు వేసే ప్రజలకు ఉచితంగా పోహా, జిలేబీలు అందజేస్తామని నగరంలో...