Railway News | వరంగల్ – సికింద్రాబాద్ మీదుగా రెండు రైళ్లు రద్దు..
Railway News | హైదరాబాద్ : సికింద్రాబాద్ డివిజన్ లో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కోసం ట్రాఫిక్ బ్లాక్ కారణంగా ఆగస్టు 1 నుంచి 31 వరకు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు (Trains Cancelled ) చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-వరంగల్ మెము (07462), వరంగల్-హైదరాబాద్ మెము (07463) రైళ్లను రద్దు చేసినట్లు ఒక పత్రికా ప్రకటనలో.దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు. రైలు ప్రయాణీకులను దీనిని గమనించాల్సిందిగా కోరారు. అసౌకర్యాన్ని నివారించడానికి తదనుగుణంగా వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసారు.
అత్యాధునిక కోచ్ లతో సికింద్రాబాద్ - విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్-విశాఖపట్నం (12739) గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (Secunderabad – Visakhapatnam Garib Rath Express ) రైలు ఇప్పుడు అత్యాధునిక కోచ్ లతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐస...