Foods For Winter: చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచే ఆహారపదార్థాలు ఇవే..! తప్పక తినండి..!
Foods For Winter: చలికాలం వచ్చేసింది. ఇదే సమయంలో జలుబు వచ్చే ప్రమాదాలు ఎక్కవగా ఉంటాయి. చల్లని వాతావరణంలో మనం మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి యత్నిస్తాం. మన శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేసుకునేందుకు మనం టీ, కాఫీ, హాట్ చాక్లెట్, సూప్ వంటి వేడి పదార్థాలను తినడానికి, తాగడానికి ఇష్టపడతాం. ఇవన్నీ కాకుండా చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచేందుకు అలాగే జలుబు, దగ్గు నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి తెలుసా.. చలికాలంలో ఏయే ఆహార పదార్థాలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం
చలికాలంలో బెల్లం తినడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగు పర్చడమే కాకుండా జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది. ఇది జలుబు...