దక్షిణ మధ్య రైల్వేలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.83,000 కోట్లు : మంత్రి కిషన్ రెడ్డి
South Central Railway | దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు 83,000 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. సికింద్రాబాద్ రైల్ నియంలో గురువారం జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి, SCR జోన్ పరిధిలోని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 10 మంది ఎంపీలు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై రైల్వే అధి కారులుతో ఎంపీలు చర్చించారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైళ్ల హాల్టింగ్, కొత్త రైల్వే లైన్లు,రైల్వే అండర్ బ్రిడ్జీలు, అండర్ సాస్ వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు వారి వారి నియోజకవర్గాల పరిధిలో రైల్వే సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ... దక్షిణ మధ్య రైల్వే ప...