RG కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌ను రద్దు
Ex-RG Kar Principal Sandip Ghosh | RG కర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌ను గురువారం రద్దు చేసింది. ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసులో ఘోష్ సీబీఐ కస్టడీలో ఉన్నారు. సెప్టెంబర్ 19న WBMC నిర్వహించే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల జాబితా నుంచి మాజీ ప్రిన్సిపాల్ తొలగించారు.
బెంగాల్ మెడికల్ యాక్ట్, 1914లోని వివిధ నిబంధనల ప్రకారం సందీప్ ఘోష్ లైసెన్స్ ను రద్దు చేసింది. అంతకుముందు, RG కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పాలిగ్రాఫ్ పరీక్షలు, లేయర్డ్ వాయిస్ విశ్లేషణ ప్రతిస్పందనలను CBI 'మోసపూరితమైనది' అని పేర్కొంది.భయంకరమైన కోల్‌కతా అత్యాచారం హత్య కేసులో షాకింగ్ వివరాలు నిరంతరం వెలుగు చూస్తునే ఉన్నాయి. ఘోష్ తోపాటు తాలాపూర్ స్టేషన్ SHO అభిజిత్ మోండల్ అరెస్టు తరువాత, వారి CBI రిమాండ్ నోట్‌లను మీడియా సంస్థలు బహిర్గతం చేశాయి. సంఘట...