Sandeshkhali | సందేస్‌ఖాలీ దాడిలో విదేశీ పిస్టల్స్‌తో సహా భారీగా ఆయుధాలను స్వాధీనం..
Sandeshkhali Raids | పశ్చిమ బెంగల్ లోని సందేశ్ ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందంపై జరిపిన దాడికి సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈమేరకు శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలోని రెండు స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 5న సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ అనుచరుల నుంచి ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా సీబీఐ అధికారుల, ఎన్‌ఎస్‌జీ కమాండోల బృందం సందేశ్‌ఖాలీకి చేరుకున్న విషయం తెలుసుకొని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల సాయంతో ఐదు బృందాలు దాడులు నిర్వహించాయని ఏజెన్సీ అధికారులు తెలిపారు. కొందరు అనుమానితుల వద్ద భారీగ...