Sabarimala Yatra: ₹11 వేలకే శబరిమల యాత్ర.. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు
IRCTC టూర్ ప్యాకేజీ | శబరిమల యాత్ర కు వెళ్లాలనుకునే వారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ ఆండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్తగా భారత్ గౌరవ్ టూరిస్టు రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాల కోసం నడిపిస్తున్న భారత్ గౌరవ్ టూరిస్టు రైళ్లకు యాత్రికుల నుంచి భారీ స్పందన వస్తుండటంతో కొత్తగా మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. తాజాగా సికింద్రాబాద్ (Irctc Sabarimala Package From Hyderabad) నుంచి శబరిమల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. నవంబర్ 16 నుంచి 20 వరకు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించిన కరపత్రాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సోమవారం ఆవిష్కరించారు.
తెలుగు రాష్ట్రాల్లో హాల్లింగ్ స్టేషన్లు
ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్,నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, న...