Ravindra Jadeja | బిజెపిలో చేరిన భారత స్టార్ క్రికెటర్
Ravindra Jadeja | భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే, రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ధృవీకరించారు. రివాబా తన ఫోటోలను Xలో పోస్ట్ చేసింది. తన పోస్ట్‌లో, రివాబా బిజెపి సభ్యత్వ కార్డులతో తాను, తన భర్త చిత్రాలను కూడా షేర్ చేశారు.మీడియాతో రివాబా మాట్లాడుతూ.. 'నేను ఇంటి నుంచే సభ్యత్వ ప్రచారాన్ని ప్రారంభించాను. మెంబర్‌షిప్ క్యాంపెయిన్‌ను ఇటీవల ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రారంభించారని, ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సెప్టెంబర్ 2 న మొదటి సభ్యుడిగా మారారని తెలిపారు.
రివాబా రాజకీయ ప్రస్థానం..
2019లో రివాబా భాజపాలో చేరారు. పార్టీ అధిష్ఠానం ఆమెను 2022లో జామ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దింపింది. ఆప్ అభ్యర్థి కర్షన్‌భాయ్ కర్మూర్‌పై రివాబా విజయం సాధించారు. అదే సమయంలో, తన ఎన్న...