Anganwadi Workers | అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Good News To Anganwadi Workers | రాష్ట్రంలోని అంగన్ వాడీ టీచర్లకు, సహాయకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రెండు లక్షలు, సహాయకులకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ లోని రహమత్ నగర్‌లో జరిగిన అమ్మమాట - అంగన్ వాడీ బాట కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన జీవో జారీ చేస్తామని చెప్పారు. అంగన్ వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. జీవో 10 రద్దు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు, గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈమేరకు జూలై 15న సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్ వాడీల...