PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు
PM Modi 3.0 | ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిద్వారా భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత దేశంలోని మొదటి ( ఏకైక) మూడు పర్యాయాలు ప్రధాని అయిన వ్యక్తి గా మోదీ (PM Modi 3.0) నిలవనున్నారు. కాగాప్రధాని మోదీ తన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. అలాగే తన పదవికి రాజీనామాను అందజేశారు. జూన్ 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం పూర్తయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు.2014లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి 240 సీట్లు గెలుచుకుంది. 272 మెజారిటీ మార్కుకు 32 తక్కువ. ఇది ఇప్పుడు మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు గెలుచుకున్న 53 స్థానాలపై ఆధారపడుతుంది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో త...