SC/ST/OBC రిజర్వేషన్లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
Amit Shah | లక్నో: లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఎస్సీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థి రాజ్‌వీర్‌సింగ్‌కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా, కాంగ్రెస్‌ను 'అబద్ధాల ఫ్యాక్టరీ' అని అభివర్ణించారు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)-కాంగ్రెస్ కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) రిజర్వేషన్లను అమలు చేస్తుందన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్‌ను తొలగిస్తామని రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చెప్పారు. రెండు పర్యాయాలు మాకు పూర్తి మెజారిటీ ఉందని, కానీ నరేంద్ర మోడీ (PM Modi) రిజర్వేషన్‌కు మద్దతు తెలిపారని గుర్తుచేశారు. రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేయదన...