IRCTC Economy Meals | రైల్వే ప్రయాణీకులకు అతితక్కువ ధరలో భోజనం, స్నాక్స్.. రూ.20 నుంచి ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
IRCTC Economy Meals | రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. జనరల్ క్లాస్ కోచ్‌లలో ప్రయాణించేవారికి అతితక్కువ ధరలకు పరిశుభ్రమైన భోజనం, స్నాక్స్ (Economy Khana ) అందించే ఐఆర్సీటీసీ తన ప్రాజెక్టును మరిన్ని రైల్వేస్టేషన్లకు విస్తరించింది. రైళ్లు, స్టేషన్లలో ప్రయాణీకులకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన 'ఎకానమీ ఖానా' అందిస్తున్నామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ఆహార పదార్థాల, నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పర్యవేక్షించేందుకు తాము నిరంతరం నిఘా పెడతామని వారు తెలిపారు.
ఈ చొరవ ఎందుకు తీసుకున్నారు?
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నారు. IRCTC అధికారి మాట్లాడుతూ, "మేము వేసవి కాలంలో ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నామని అన్‌రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే వారు ఎదుర్కొంటున్న ...