వీడియో: పగిలిపోయిన మద్యం బారెల్.. వీధుల్లో నదిలా ప్రవహించిన రెడ్ వైన్
పోర్చుగీస్ లోని ఓ చిన్న పట్టణం సావో లోరెంకో డి బైరోలోని వైన్ తయారీ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. దీంతో భారీగా రెడ్ వైన్ వీధుల్లో ప్రవహించింది.
600,000 గ్యాలన్ల మద్యాన్ని నిల్వచేసిన బారెల్స్ ఊహించని విధంగా కూలిపోవడంతో ఈ సంఘటన జరిగింది. నదీ మాదిరిగా రెడ్ వైన్ వీధుల్లో ప్రవహించిన దృశ్యాలను కొందరు వీడియోలు తీశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వీడియోలో సోవో లోరెంకో డి బైరో అనే చిన్న పట్టణంలోని ఓ వీధిలో ఎర్రటి ద్రవం ప్రవహిస్తున్నట్లు చూపించాయి. లీకేజీ అయిన వైన్ ఒలింపిక్-స్విమ్మింగ్ పూల్‌లో నిండి ఉండవచ్చు
వైన్ వీధులమీదుగా ప్రవహించడంతో అధికారులు వైన్‌ని ఆపడానికి ప్రయత్నించారు. అనాడియా ఫైర్ డిపార్ట్‌మెంట్ వరదను ఆపివేసి సెర్టిమా నదిలో కలవకుండా దూరంగా మళ్లించింది. అక్కడి నుంచి వైన్ ప్రవాహం సమీపంలోని పొలంలోకి వెళ్లిందని స్థానిక మీడియాను ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
...