Current Bill Payment | కరెంటు బిల్లులు చెల్లించేవారికి అలర్ట్.. డిస్కమ్ కీలక సూచనలు..
హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్‌పీడీసీఎల్ కీలక సూచనలు చేసింది. కరెంటు బిల్లులు చెల్లించేవారు ఆర్‌బిఐ ఆదేశాల మేరకు ఫోన్ పే, గూగుల్ పే, అమేజాన్ పే ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.Current Bill Payment | తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ విద్యుత్ బిల్లులను బ్యాంకులు నిలిపివేయడంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా బిల్లులు చెల్లించడం సాధ్యపడదు.అయితే, విద్యుత్ వినియోగదారులు తమ కరెంటు బిల్లులను TGSPDCL వెబ్‌సైట్, లేదా దాని మొబైల్ యాప్ ద్వారా చెల్లించవచ్చు. TGSPDCL అధికారిక 'X' హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. అలాగే వినియోగదారులు తమ బిల్లులను కంపెనీ బిల్లుల చెల్లింపు కేంద్రాల ద్వారా కూడా చెల్లించవచ్చు.
...