Ayodhya Ram Mandir LIVE Updates : ప్రాణ ప్రతిష్ఠకు ముందు అందంగా ముస్తాబైన రామమందిరం..
Ayodhya Ram Mandir LIVE Updates : జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది, దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తో సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
అయోధ్యలో జరిగిన సంకీర్తన సందర్భంగా గత గురువారం ఆలయ గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ఉంచారు. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన 'రామ్ లల్లా' విగ్రహం 1.5 టన్నుల బరువు , 51 అంగుళాల పొడవు ఉంటుంది.'ప్రాణ్ ప్రతిష్ఠ' క్రతువులను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తుండగా, లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలకు సంబంధించి ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.
అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు కేవలం ఒకే ఒక రోెజు మాత్రమే మిగిలి ఉండగా, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొత్తగా నిర్మించిన ఆలయానికి సంబంధించిన ఆకర్షణీకమైన ఫొటోలను విడుదల చేసింద...