
రాజ్ నీతి ఒపీనియన్ పోల్.. సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
తెలంగాణలో బీఆర్ఎస్(BRS) హాట్రిక్ పక్కా..హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ జైత్రయాత్ర ఈసారి కూడా కొనసాగుతుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో గులాబీ పార్టీ హ్యాట్రిక్ పక్కా అని వెల్లడిస్తున్నాయి. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వానికే జనం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని పేర్కొంటున్నాయి. సీఎం కేసీఆరే పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారని ఇప్పటికే ఇండియా టీవీ, మిషన్ చాణక్య, ఎన్పీఐ, ఈఎన్ టీవీ తదితర సర్వేలు తేల్చి చెప్పాయి. తాజాగా, రాజ్ నీతి సర్వేలో (Rajneethi Opinion Poll) బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడయింది.
బీఆర్ఎస్ పార్టీకి 77 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఉచితాలు ఇస్తామంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ కేవలం 29 స్థానాలకే పరిమితం కానుంది. ఇక బీజేపీ ఆరు సీట్లతో మరోసారి సింగిల్ డిజిట్ వరకే పరిమితమవనుంది. ఇక బీఎస్పీ అస...