Telangana | నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన
Rajiv Gandhi Abhaya Hastham : ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకం (Rajiv Gandhi Abhaya Hastham) కింద రూ.లక్ష చొప్పున చెక్కులను సీఎం సోమవారం పంపిణీ చేశారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 135 మందికి చెక్కులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని గుర్తుచేశారు. సివిల్స్ ఉత్తీర్ణులై కుటుంబాలకు, రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం తీసుకురావాలని కోరారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.లక్ష ఆర్థిక సాయం అ...