Mahant Balak Nath | యోగి ఆదిత్యానాథ్ తరహాలో మరో సన్యాసికి బీజేపీ పట్టం?
రాజస్తాన్ లో మరో యోగీ.. సీఎం పదవి రేసులో మహంత్ బాలక్ నాథ్..
Rajasthan Assembly Election: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోయింది. విజయం దాదాపు ఖరారయ్యింది. కాగా.. ఊహించని విధంగా రాజస్తాన్ ముఖ్యమంత్రి రేసులోకి ఓ సన్యాసి తెరపైకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.రాజస్తాన్ లో బీజేపీ విజయం ఖాయమైన క్రమంలో ఇప్పుడు సీఎం ఎవరు అవుతారనేదానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే సీఎం రేసులో వసుంధర రాజే ముందుండగా మరోవైపు మహంత్ బాలక్ నాథ్ (Mahant Balak Nath) కూడా తెరపైకి వచ్చారు. ఆయనకు ఆర్ఎస్ఎస్, బీజేపీ అధిష్ఠానం ఆశీస్సులు ఉండడండంతో అనూహ్యంగా ఈ రేసులోకి దూసుకువచ్చారు.40 ఏళ్ల మహంత్ బాలక్ నాథ్ రాజస్తాన్ (Rajasthan) లోని అల్వార్ నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తిజార (Tijara) సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. ఈ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. ఆయన రాజస్తా...