Sambhal Power Theft case | సంభాల్ ఎంపీ ఇంటికి కరెంటు సరఫరా నిలిపివేత
Sambhal Power Theft | సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సంభాల్ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్ నివాసంలో రెండు విద్యుత్ మీటర్లను ట్యాంపరింగ్ చేసినట్లు ఆధారాలు లభించడంతో ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ గురువారం ఆయనకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. గురువారం ఉదయం ఆయన ఇంటిలో అధికారులు తనిఖీ చేసిన తరువాత టాంపరింగ్ నిజమని తేలడంతో అతడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.. సంభాల్‌లోని మసీదు సర్వేపై ఇటీవల జరిగిన హింసలో నలుగురు మృతిచెందిన కేసులో బార్క్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.జిల్లా విద్యుత్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఎంపీపీ ఇంటి వద్ద రెండు విద్యుత్ మీటర్లలో ట్యాంపరింగ్ జరిగినట్లు ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ చౌర్యం నిరోధక చట్టంలోని సెక్షన్ 135 కింద కేసు నమోదు చేశారు. విద్యుత్ శాఖ గతంలో ఎంపీ ఇంటి నుంచి పాత మీటర్లను తొలగించి సీల్ వేసి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపింది. ఎంపీ ఇంటి ...