
MGNREGA పేరు మార్పుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం: కొత్త పేరు ‘PBGRY’
ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకానికి కొత్త రూపంగ్రామీణ భారతదేశ ఆర్థిక బలాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం.న్యూఢిల్లీ, డిసెంబర్ 12: గ్రామీణ భారతదేశ ఆర్థిక బలాన్ని బలోపేతం చేసేందుకు ఉపాధికి హామీ కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) పేరు మార్చే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకానికి కొత్త పేరును ఖరారు చేసింది.MNREGA కొత్త పేరు ఏమిటి?MNREGA పథకాన్ని ఇప్పుడు "పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన" (PBGRY) గా పిలవనున్నారు. ఈ మార్పు గ్రామీణ ఉపాధి హామీ పథకాలపై ప్రభుత్వ దృష్టిని, ప్రాధాన్యతను మరోసారి ప్రతిబింబిస్తుంది.కాగా MNREGA ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకాలలో ఒకటి. దీనిని 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ఈ పథకాన్ని గతంలో కేవలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (NREGA) అని పిలిచే...
