Telangana BJP | “బీజేపీకి నమ్మకమే ఆస్తి – రాజాసింగ్‌కు చెక్ పెట్టే యోచనలో పార్టీ?”
బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చనివారు.. పార్టీని వీడినా నష్టం లేదు : రామచందర్రావుTelangana BJP | హైదరాబాద్ : బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చక ఎవరు పార్టీని వీడినా నష్టం లేదని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (Ramachandra Rao) స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకున్నవారికి బీజేపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని అందుకు తాను ఒక ఉదాహరణ అని అన్నారు.పార్టీ అభివృద్ధికి పని చేసిన ప్రతీఒక్కరికీ కచ్చితంగా అవకాశాలు వస్తాయని తెలిపారు. కాగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), ఎంపీ డీకే అరుణ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విధానాలు నచ్చనివారు పార్టీని వీడినా నష్ట...