Railway Super App | రైల్వే టికెట్ బుకింగ్, ట్రాకింగ్ కోసం త్వరలో సూపర్ యాప్..!
Railway Super App | రైలు ప్రయాణికులకు శుభవార్త, ఆన్ లైన్ లో రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ప్రయాణికులు సాధారణంగా ఐఆర్‌సీటీసీని ఉపయోగిస్తుంటారు. రైల్వే ప్రయాణికులకు కోసం పలు రకాల ప్రైవేట్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, రైల్వే శాఖ అన్నిరకాల సేవలు అందించేందుకు తాజాగా సరికొత్త సూపర్ యాప్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో అన్ని రైల్వేసేవలు అందుబాటులోకి రానున్నాయి.ప్రయాణికుల కోసం కొత్తగా సూపర్ యాప్‌ని రూపొందిస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు. రైల్వేలకు సంబంధించిన అన్నిసేవలు ఈ యాప్‌లో ఉంటాయని చెప్పారు. రైలు టికెట్ బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ యాప్, వెబ్‌సైట్‌ని ఉపయోగిస్తున్నారు. అలాగే, రైలు స్టేటస్‌ని ట్రాక్ చేసేందుకు, పీఎన్‌ఆర్ స్టేటస్‌ని చూసేందుకు వివిధ రకాల యాప్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే, రైల్వేశాఖకు సంబంధించి...