5% వడ్డీతో రూ.లక్ష రుణం: ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం అంటే ఏమిటి?
PM Vishwakarma Yojana : హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుపేద చేతి వృత్తులారికి తక్కువ వడ్డీతో రుణాలు అందించడమే కాకుండా వారిలో వృత్తి నైపుణ్యలను పెంచి, మార్కెటింగ్ లోనూ మద్దతునిచ్చేందుకు కేంద్రం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఐదేళ్ల కాలానికి రూ.13,000 కోట్ల వ్యయంతో ప్రధానమంత్రి ‘విశ్వకర్మ యోజన’ పేరుతో కొత్త పథకానికి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
ఆగస్టు 15న తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ సెప్టెంబర్‌లో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే..కాగా ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల పై కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వేలు, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాక...