Nitin Gadkari | జాతీయ రహదారులపై మరిన్ని సౌకర్యాలు.. త్వరలో హమ్‌సఫర్ పాలసీ
Nitin Gadkari - Humsafar Policy | దేశవ్యాప్తంగా జాతీయ రహదాని నెట్‌వర్క్‌లో మరిన్ని అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ రహదారుల వెంట ప్రయాణించే వారి కోసం క్లీన్ టాయిలెట్స్, బేబీ కేర్ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ‘హమ్‌సఫర్ పాలసీ (Humsafar Policy )’ని ప్రారంభించారు. ఈ పాలసీ కింద రహదారుల వెంట బేబీ కేర్ రూమ్స్, క్లీన్ టాయిలెట్స్, వీల్‌చైర్స్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్, పార్కింగ్ ప్రాంతాలు, ఫ్యూయల్ స్టేషన్లలో హాస్టల్ తదితర సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ విధానంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అనుకూలమైన, సురక్షితమైన, ఉత్సాహభరితమైన ప్రయాణ అనుభూతిని అందించనుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో ఈ పాలసీ దోహదపడుతు...