Earthquake : మయన్మార్ కు భారత్ ఆపన్న హస్తం
Earthquake : భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్ కు భారత్ ఆపన్న హస్తం అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ ప్రభుత్వ చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్తో మాట్లాడారు. మయన్మార్ను కుదిపేసిన భూకంపంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మయన్మార్ ప్రజలకు భారతదేశం అండగా నిలబడటానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఆపరేషన్ బ్రహ్మ (Operation Brahma) కింద, విపత్తు సహాయ సామాగ్రి, మానవతా సహాయం, సెర్చ్, రక్షణ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు వేగంగా పంపుతున్నామని ఆయన అన్నారు.'X' పోస్ట్లో ప్రధాని మోదీ భూకంపం (Earthquake)లో మరణించిన వారికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఒక సన్నిహిత మిత్రుడిగా, పొరుగు దేశంగా, భారతదేశం ఈ క్లిష్ట సమయంలో మయన్మార్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది. ఆపరేషన్ బ్రహ్మ కింద విపత్తు సహాయ సామాగ్రి, మానవతా సహాయం, శోధన, రక్షణ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు వేగంగా పంపుతున్నాం ...