వేరుశెనగలతో గుండె జబ్బులకు చెక్ : నివేదిక
Peanuts For Heart Health: నిపుణులు గుండె ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాలపై చాలా కాలంగా దృష్టి పెట్టారు. అయితే ప్రపంచ వ్యాప్త
పరిశోధనలు, యూరోపియన్ హార్ట్ జర్నల్ జూలై 2023 సంచికలో ఓ నివేదిక వెలువడింది. హానికరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం కంటే పోషకాహార లోపాల కారణంగా వాస్తవానికి గుండె సమస్యలకు కారణమవుతుందని నిపుణులు కనుగొన్నారు.80 దేశాలలో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం. పోషకాహారాల తక్కువ వినియోగానికి.. గుండెపోటు స్ట్రోక్‌లకు మధ్య లింక్ ను గుర్తించారు. ఇందులో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు, పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు చేపలు ఉన్నాయి.ప్రాస్పెక్టివ్ అర్బన్ రూరల్ ఎపిడెమియాలజీ (PURE) అధ్యయనంలో అధిక కార్బోహైడ్రేట్ తీసుకోవడం, పండ్లు, కూరగాయలు, అసంతృప్త కొవ్వులు (మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు) తక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా...