Waqf Amendment Bill : వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో ఎవరు మద్దతు ఇస్తున్నారు.. ఎవరు వ్యతిరేకిస్తున్నారు?
Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లు 2024 బుధవారం లోక్‌సభకు రానుంది. ప్రతిపాదిత చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ మంగళవారం సభ నుంచి కాంగ్రెస్ దాని మిత్ర పక్సాలు వాకౌట్ చేశాయి. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై చర్చతోపాటు ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది.కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అన్ని ప్రధాన పార్టీల నాయకులతో కూడిన లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ (BAC) ఎనిమిది గంటల చర్చకు అంగీకరించిందని, సభలో అప్పటి పరిస్థితిని బట్టి దీనిని పొడిగించవచ్చని అన్నారు.ప్రభుత్వం తమ గొంతులను అణచివేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్, అనేక ఇతర ఇండియా బ్లాక్ సభ్యులు వాకౌట్ చేయడంతో, బిల్లుపై ట్రెజరీ, ప్రతిపక్షాల మధ్య వేడి చర్చ జరగనుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, రాజకీయ ఉద్రిక్తతలు, చర...