Protests in PoK : అట్టుడుకుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్.. పీఓకేలో హింసాత్మక నిరసనలు ఎందుకు చెలరేగాయి?
Protests in PoK : పాక్ ఆక్రమిత కశ్మీర్ (Pakistan-occupied Kashmir) అట్టుడుకుతోంది. నిరసనకారులు భద్రతా బలగాల మధ్య ఘర్షణలు (Violence) చెలరేగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు అధికారి మరణించగా, మరో 90 మంది గాయపడ్డారు. ముజఫరాబాద్‌లో హింస చెలరేగడంతో మిర్పూర్, ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ (ఎజెకె)లో మార్కెట్లు, పాఠశాలలు, కార్యాలయాలు వరుసగా రెండవ రోజు కూడా వేసివేశారు. అవామీ యాక్షన్ కమిటీ (AAC) శుక్రవారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా PoK లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు చేపట్టింది. ఆందోళనలను అణచివేసేందుకు పాకిస్తాన్ భద్రతా దళాలు యత్నించగా ప్రజలు తిరగబడ్డారు. ముజఫరాబాద్‌లో వీల్-జామ్, షట్టర్-డౌన్ సమ్మె కారణంగా మే 10న సాదారణ జనజీవనం స్తంభించిపోయింది.అధిక పన్నులు, విద్యుత్ బిల్లులు, ద్రవ్యోల్బణం (Inflation) ఒక్కసారిగా పెరగడంతో పీవోకేలోని ప...