
Pakistan Economic Crisis | పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ చితికిపోవడానికి కారణాలేంటి? మోదీ ప్రభుత్వ వ్యూహం ఫలించిందా!
Pakistan Economic Crisis Explained | మన పొరుగుదేశం దేశం పాకిస్థాన్ (Pakistan) ఆర్థికంగా చితికిపోయి సాయం కోసం అన్ని దేశాలను యాచిస్తోంది. గత ఐదేళ్లలో ఆ దేశ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2024 మే 17న, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి (Pulwama Attack)లో 40 మంది వీర జవాన్లను కోల్పోయిన తర్వాత భారత్ వైఖరిలో మార్పు వచ్చిందని అంగీకరించారు. ఆర్టికల్ 370 రద్దుపై ఇషాక్ దార్ స్పందిస్తూ.. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.. ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడి తర్వాత, పాకిస్తాన్ నుంచి ఎగుమతులపై భారతదేశం 200% సుంకాన్ని విధించిందని, నియంత్రణ రేఖ వెంబడి కాశ్మీర్ బస్సు సర్వీస్, వాణిజ్యాన్ని నిలిపివేసిందని అన్నారు.పాక్ తో వాణిజ్యాన్ని తగ్గించడానికి భారతదేశం తక్షణ చర్యలు తీసుకుంది. ఈ చర్యల్లో భాగంగా మొదటిది.. పాకిస్తాన్ ఇకపై 'అత్యంత అనుకూల దేశాల' లేదా MFN...