Tuesday, December 30Welcome to Vandebhaarath

Tag: PAKISTAN ARMY CHIEF

WATCH | 25 ఏళ్ల తర్వాత తొలిసారి కార్గిల్ యుద్ధంలో పాత్రను అంగీకరించిన పాక్ సైన్యం
Trending News

WATCH | 25 ఏళ్ల తర్వాత తొలిసారి కార్గిల్ యుద్ధంలో పాత్రను అంగీకరించిన పాక్ సైన్యం

KARGIL WAR | 25 ఏళ్ల క్రితం 1999 లో జ‌రిగిన‌ కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొన్నట్లు పాకిస్థాన్ ఆర్మీ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. దేశ రక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రసంగిస్తూ 1965, 1971, 1999లో కార్గిల్‌లో యుద్ధాల్లో పలువురు సైనికులు తమ ప్రాణాలను అర్పించారని వెల్ల‌డించారు. "పాకిస్తానీ కమ్యూనిటీ అనేది ధైర్యవంతుల సంఘం, "అది 1948, 1965, 1971, 1999 కార్గిల్ యుద్ధం కావచ్చు, వేలాది మంది షుహాదాలు (అమరవీరులు) పాకిస్తాన్ కోసం తమ ప్రాణాలను అర్పించారు అని రావల్పిండిలో జరిగిన కార్యక్రమంలో ఆయన అన్నారు.ఇదివ‌రకెప్పుడూ పాకిస్తాన్ సైన్యం 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న‌ట్లు బహిరంగంగా అంగీకరించలేదు చొరబాటుదారులను "కాశ్మీరీ స్వాతంత్ర్య సమరయోధులు" లేదా "ముజాహిదీన్ లు అంటూ పేర్కొంటూ వ‌చ్చింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తాజా వ్యాఖ...