MHA : భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు
India-Pakistan Tensions : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శత్రు దాడి జరిగినప్పుడు అన్ని విధాలా సర్వసన్నద్దంగా ఉండడానికి ప్రజల్లో అవగాహనను పెంచడానికి మే 7, బుధవారం సమగ్ర పౌర రక్షణ మాక్ డ్రిల్‌లను నిర్వహించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.పాకిస్తాన్ -భారత్ మధ్య నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో వైమానిక దాడులు జరిగితే ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలన్న విషయంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 7వ తేదీన సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ (MHA) రాష్ట్రాలకు సూచించింది. యువత, విద్యార్ధులకు ఈ విషయంలో శిక్షణ ఇవ్వాలని కోరింది. సైరన్ మోగగానే ఎలా రక్షణ చేసుకోవాలన్న విషయంపై మాక్‌డ్రిల్‌లో వివరిస్తారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే ఈ అంశంపై అప్రమత్తం చేశారు. సరిహద్దుల్లోని విద్యార్ధులకు ఇప్పటికే అవగ...