Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: opposition demands resignation

Kallakurichi | క‌ల్తీ మ‌ద్యం కేసు.. 49కి చేరిన మృతుల సంఖ్య.. న్యాయ విచారణకు స్టాలిన్ ఆదేశం..
Crime

Kallakurichi | క‌ల్తీ మ‌ద్యం కేసు.. 49కి చేరిన మృతుల సంఖ్య.. న్యాయ విచారణకు స్టాలిన్ ఆదేశం..

Kallakurichi Hooch Tragedy | కరుణాపురం, కళ్లకురిచిలో కల్తీ మద్యం ఘ‌ట‌న‌లో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు మరో పది మంది ప్రాణాలు కోల్పోవడంతో కళ్లకురిచి దుర్ఘటనలో మృతుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం, మరో 115 మంది కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల- ఆసుపత్రితో పాటు సేలం, విల్లుపురం, పుదుచ్చేరిలోని జిప్మర్‌లోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గురువారం మంత్రి ఉదయనిధి స్టాలిన్ బాధిత కుటుంబాలను పరామర్శించి, చెక్కులను అందజేసి, కల్తీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. న‌లుగురి అరెస్టు ఈ దుర్ఘటనపై విచారణ జరిపి భవిష్యత్...