
One Nation One Election | జమిలి ఎన్నికలు అంటే ఏమిటీ.. ఒకేసారి ఎన్నికలతో లాభాలు ఏమిటీ? పూర్తి వివరాలు ఇవే..
One Nation One Election | 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు'పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ (kovind panel) తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గురువారం సమర్పించింది. మొదటి దశగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ప్యానెల్ ప్రతిపాదనలో చేర్చలేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది.
తొలినాళ్లలో జమిలీ ఎన్నికలే..
స్వాతంత్య్రానంతరం భారతదేశంలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే భావన వచ్చింది. 1967 వరకు, భారతదేశంలో రాష్ట్ర అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మొదటి ఎన్నికలు 1952లో జరిగాయి. ఆ తర్వాత 1957, 1962, 1967లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే 1968లో కొన్ని రాష్ట్రాల శాసనస...