Tuesday, December 30Welcome to Vandebhaarath

Tag: Odisha Bus Accident

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం
National

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్​ వాహనం.. అక్కడికక్కడే 12 మంది మృతి..Odisha Accident Today : ఒడిషా రాష్ట్రంలోని గంజామ్ జిల్లా లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.. ఇందులో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గంజామ్ జిల్లా దిగప హండి సమీపంలో.. ఒడిశా ఆర్టీసీ బస్సు, ఓ ప్రైవేటు బస్సు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో దుర్ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతతో రెండు బస్సులూ పూర్తిగా నుజ్జునుజ్జుయ్యాయి. ప్రమాదం గురించి స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున అంబులెన్సులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను బ్రహ్మపురలోని ఎంకేసీజీ ( MKCG ) ఆస్పత్రికి తరలించారు. ...