సెప్టెంబర్ 19 వరకు ఓటరు నమోదు కార్యక్రమం
18ఏళ్లు నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలి
హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఓటరు నమోదు ఈవీఎంల వినియోగంపై అవగాహన
హన్మకొండ: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. శనివారం స్వీప్ ఓటరు నమోదు, ఓటు హక్కు, ఈవీఎంల వినియోగంపై జిల్లాలోని వివిధ కళాశాలల యువతకు కలెక్టరేట్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా ఓటురుగా నమోదైన ప్రతి ఒక్కరు కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రత్యేక కాంపెయిన్లో భాగంగా ఈ నెల 26 , 27వ తేదీల్లో అలాగే వచ్చే నెల 2, 3వ తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సెప...