Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: New Ration Cards Application

New Ration Cards | కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం త్వరలో దరఖాస్తులకు ఆహ్వానం!
Telangana

New Ration Cards | కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం త్వరలో దరఖాస్తులకు ఆహ్వానం!

New Ration Cards | హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం తాజాగా దరఖాస్తులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త రేషన్‌కార్డులు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాలని, ఇక నుంచి విడివిడిగా మంజూరు చేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం శాసనమండలిలో ప్రకటించారు. కౌన్సిల్‌లో అడిగిన ఒక‌ ప్రశ్నకు సమాధానమిస్తూ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలు ఇప్పటికీ క్యాబినెట్ సబ్‌కమిటీ పరిశీలనలో ఉన్నాయని వెల్ల‌డించారు.“మేము కొత్త‌ రేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలను రెండు వారాల్లో ఖరారు చేస్తాం. రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను సరఫరా చేసే అంశాన్ని ...